Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 7వ వార్డు-తిరుమలగిరి, గన్ రాక్ విలేజ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ పరిస్థితిని మంగళవారం శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం స్థానికులు శ్రీగణేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీగణేష్‌ను సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి ఆటస్థలాన్ని పరిశీలించారు. స్థానికుల ద్వారా ఆట స్థలం సమస్యను అడిగి తెలుసుకు న్నారు నిరూపయోగంగా ఉన్న టాయిలె ట్స్‌కి మరమ్మతులు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు శ్రీ గణేష్‌ను కోరారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి దృష్టికి ఈ తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు పరిష్క రించకపోతే శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో గన్‌రాక్ విలేజ్ సొసైటీ ప్రెసిడెంట్ గోకుల్, వైస్ ప్రెసిడెంట్ నవీన్, శశాంక్ కార్యదర్శి రాజేందర్ (అడ్వాయిజర్), గణేష్, శశాంక్, అక్షరు, మహేందర్, నితిన్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.