Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
మద్యం మత్తులో మహిళపై సామూహిక లైంగిక దాడి చేసిన దుండగులు.. ఆపై హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించి, డాగ్ స్వ్కాడ్స్‌తో తనిఖీ చేశారు. మృతురాలి కొడుకు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తారమతిపేట్ గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల అండాలు, ఈదయ్య అలియాస్ మల్లేశ భార్యాభర్తలు. దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి కొడుకు మల్లేశ్ హయత్‌నగర్‌లో ఉంటున్నాడు. మంగళవారం సుమారు ఉదయం 08:30 గంటలకు ఒర్సు కృష్ణ మల్లేశ్‌కు ఫోన్ చేసి 'మీ అమ్మ అండాలు, ఇంట్లో చనిపోయి ఉంది. శరీరంపై గాయాలు ఉన్నాయి' అని చెప్పాడు. దాంతో వెంటనే ఆయన గ్రామానికొచ్చి చూడగా తల్లి విగతజీవిగా పడి ఉంది. ఆమె ఎడమ చెయ్యికి, ఎడమ భుజం నుంచి మెడ వరకు బలమైన కమిలిన గాయం కనిపించాయి. దాంతో అండాలు భర్త ఈదయ్య, కొడుకు మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తారామతిపేట్ గ్రామానికి చెందిన బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్ అనే వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీ చేశారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.