Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ కంటోన్మెంట్ వికాస్ తీవ్ర కృషి చేస్తోంది. విలీనం కోసం ప్రత్యేకంగా మంచు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇచ్చారు. ప్రతిరోజూ ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా ప్రతినిధులు కలుస్తున్నారు. పార్లమెంటరీ సెక్రెటరీకి, ఇతర అధికారులు కూడా ఆన్లైన్ ద్వారా వినతులు అందిస్తున్నారు. విలీనం విషయాన్ని శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు. కాగా మంగళవారం వికాస్ సభ్యులు ఏబుల్ రవీందర్, తదితరులు కంటోన్మెంట్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జి బొల్లు కృష్ణ ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని కోరారు. ఇందుకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా సానుకూ లంగా స్పందించడంతో కంటోన్మెంట్ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనమైతే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మంచి ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను వివరిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు నగరం నడిబొడ్డున ఉన్నా ఇప్పటికీ భవన నిర్మాణాల్లో ఎలాంటి మార్పు లేదనీ, బ్రిటిష్ కాలం నాటి చట్ట ప్రకారమే నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నారనీ, ఉద్యోగాలకు బదిలీలు ఉండటం లేదనీ, నిధులు సరిపడా రావటం లేదని వివరిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ్‌ను కలిసిన వారిలో తదితరులు ఉన్నారు.