Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
వికలాంగులు, వృద్ధుల పెన్షన్లు రూ.6 వేలకు పెంచా లనీ, వికలాంగులకు పెన్షన్ 5వ తేదీలోపు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం కాసిం అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ ఓల్డ్ నేరేడ్ మెట్లోని అంబేద్కర్ భవన్లో మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వీహెచ్పీఎస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎన్.వినరు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గడ్డం కాసీం, ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కేశ పాగా రాంచందర్ మాదిగ పాల్గొని మాట్లాడారు. 2007 ఆగస్టు 28న హక్కులు, ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగ స్వామ్యం అనే లక్ష్యాలతో ఆవిర్భవించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి అదే ఏడాది 26న కనీవినీ ఎరు గని రీతిలో వికలాంగుల మహాగర్జన బాహ్య ప్రపంచానికి, సమస్త మానవాళికి, వికలాంగుల సమస్యలు ఏమిటో, వారు బాధ ఏమిటో తెలియజెప్పిందన్నారు. ఆ మహా గర్జన మన డిమాండ్ల సాధనకు పోరాటంగా మార్చుకుని ప్రతి ఏడాది 26న పోరాట దినోత్సవం జరుపుకుంటు న్నట్టు తెలిపారు. 26వ తేదీన పెండింగ్లో ఉన్న విక లాంగుల సమస్యల పరిష్కారానికి వికలాంగుల ఆత్మబంధువు వీహెచ్పీఎస్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇందిరాపార్వు వద్ద లక్షలాది మందితో జరిగే చలో హైదరాబాద్కు వేలాదిగా వికలాంగులు తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో వికలాంగుల ఆత్మ గౌరవం, హక్కుల అమలు రాజ్యాధికార దిశగా పయని ఇస్తామని అనుకుంటే బంగారు తెలంగాణ పేరుతో దేశంలోనే తొలిసారిగా ఏర్పడిన వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శాఖలో విలీనం చేసి, సహకార బలహీన పరచడమేనని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కే.బి.జయహరి, జి.హజరత్రెడ్డి, పి.విజరు కుమార్, జి.భాగ్య, పి.బాలామణి, పి.రాములు, ఆర్.రేవతి, జి.రాజా రమణ, తదితరులు పాల్గొన్నారు.