Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రెండో డోసు టీకా తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 6 , 7 , 8 వార్డులోని వాక్సినేషన్ సెంటర్లను మంగళవారం కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు ప్రజలు వాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలనీ, వంద శాతం వాక్సినేటెడ్ నగరంగా తయారు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేసి రెండో డోసు వేయించుకోని వారిని గుర్తించి వారు వాక్సినేషన్ సెంటర్ కు వచ్చి వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. అర్హులందరికీ రెండో డోసు అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి రామారావు, బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, జిల్లా యువజన సంక్షేమ అధికారి సుధాకర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.