Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
కేసులను చేదించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, ఇనాంగూడ గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ కాలనీలలో సుమారుగా 27 సీసీ కెమెరాలను ఏసీపీ పురుషోత్తం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేర రహిత సమాజం కోసం సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని నగర శివారు గ్రామాలు కావడం వల్ల ప్రతి ఒక్కరూ సీసీ కెమె రాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజలు తమకు తాముగా కాపాడుకున్న వారమవుతామని తెలిపారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరించినట్లు అయితే వారి కదలికలను సీసీ కెమెరాల్లో బంధించబడతాయని, అలాంటి వ్యక్తులు మీ దష్టికి వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శుభకార్యాలకు బయటికి వెళ్ళేటప్పుడు మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధరించిన బంగారు ఆభరణాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు యువత ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. యువత గ్రామానికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జెడ్పీిటీసీి బిందాస్గౌడ్, సర్పంచ్ అంతటి యశోద ఊశయ్య, ఎంపీటీసీ సాయి కుమార్‌గౌడ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.