Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదాయ వనరులు సమకూర్చుకోవటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిం చారు. ఐడీ కార్డు ఉంటేనే ఓయూలోకి అనుమతించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా ఓయూలో వాకింగ్ చేయాలంటే నెలకు రూ.200, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్ ఆడాలంటే ఒక్కొక్కరికి రూ.500 చెల్లించాలని ఉంటుంది. వీరికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొ.దీప్ల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓయూలో ఉన్న జిమ్‌లోకి ఇతరులు రావాలంటే ఒక్కొక్కరికి నెలకు రూ 1000, మూడు నెలలకు రూ.2500, ఆరు నెలలకు రూ 5000, ఏడాదికి 10వేలు చెల్లించి మెంబర్షిప్ పొందాల్సి ఉంటుందని, అలా ఐడీ కార్డ్ ఉన్న వారినే ఉదయం 6 నుంచి 7.30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు యూనివర్సిటీ లోపలికి అనుమతించ నున్నట్లు చెప్పారు. నేటి నుంచి ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రెజరరికి 'పే స్లిప్' ద్వారా నగదు చెల్లించాలని, ఇలా చెల్లించిన వారికి డిసెంబర్ 1 నుంచి ప్రవేశం ఉంటుందని చెప్పారు. ఇంకో వైపు యూనివర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగుల వాహనాలకు కూడా క్యాంపస్‌లోకి రావాలంటే వాహనాల ఎంట్రీ పాస్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే.