Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండా లని జూబ్లీహిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ పీడీ నాయుడు విద్యార్థు లకు సూచించారు. అమీర్‌పేట-1 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైబర్ సెక్యూరిటీపై విద్యార్థు లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... అన్ని వేళలా విద్యార్థి నులకు షీ-టీమ్స్‌తో పాటు పోలీసు విభాగం పూర్తి సహకారం అందిస్తాయని చెప్పారు. విద్యార్థి దశలో చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. షీటీమ్స్ లక్ష్యాలను, విధివిధానాలను సరిత, పరమేశ్వరి విద్యార్థులకు వివరిం చారు. సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని మెంటర్ శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డిప్యూటీ ఈవో చిరంజీవి, షీ టీమ్ మెంబర్స్ పరమేశ్వరి, సరిత, ఉపాధ్యాయులు సింహాచలం, హేమ, పద్మజ, విశ్వనాధ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.