Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల జెడ్.పి రోడ్డులో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వకూడదని టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆందోజ్ సత్యంచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మే రెడ్డి ఉదరు కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక కాలనీల ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి వినతిపత్రం అందజేసామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అభివద్ధి చెందుతున్న కాలనీలలో మద్యం షాపులకు అనుమతులు ఇస్తే నిత్యం అనేక సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, అందుకే కాలనీవాసులు వైన్ షాప్‌కి అద్దె ఇవ్వకూడదని నిర్ధారించినట్టు వారు తెలిపారు. ప్రశాంతంగా వుండే జెడ్.పి రోడ్లో వైన్ షాప్ పెడితే తాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని స్థానిక ప్రజల నుండి వైన్‌షాప్ పెట్టొద్దని ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉందని వారు తెలిపారు. వెంటనే ఇలాంటి వాటిని జెడ్.పి రోడ్ నుండి వేరే చోటుకు మార్పిం చాలని ఎమ్మెల్యేను కోరామని వారు తెలిపారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వేరే చోటుకి మార్పించేలా చర్యలు చేపడతామని కాలనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారని సత్యం చారి, ఉదయకుమార్ రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల ప్రతినిధులు దుర్గయ్యగౌడ్, సాయిరెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నర్సింహ, మనిపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సాయిరాం, శ్రీకాంత్ రెడ్డి, రాజిరెడ్డి, నరేష్లతో పాటు పలువురు కాలనీల నాయకులు పాల్గొన్నారు.