Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నిజాం కళాశాల చరిత్రలో మొదటిసారిగా 2022 జనవరి మొదటి వారంలో కళాశాల స్నాతకోత్సవం నిర్వహిస్తు న్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వి.రంజనీ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జాబినేషన్ ప్రొఫెసర్ బాల బ్రహ్మచారి తెలిపారు. మంగళవారం నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో స్నాతకోత్సవ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు కళాశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన మహ్మద్ అజారుద్దీన్, మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, రాకేష్‌శర్మ తదితర ప్రముఖులను ఈ స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 2015-16 విద్యా సంవత్సరం నుంచి 2021 వరకు కళాశాలలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సులు చదివిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ వరకు విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు కోరారు.
1887లో నిజాం కళాశాల ఆవిర్భవించిందని, నేటికి 134 ఏండ్లు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. పూర్తి వివరాలకు షషష.అఱఓaఎషశీశ్రీశ్రీవస్త్రవ.aష.ఱఅలో చూడవచ్చునని వారు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ చాంద్ పాషా, డాక్టర్ శశిధర్ బలే, ప్రొఫెసర్ నరేందర్, డాక్టర్ రవికిరణ్, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.