Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహిత్యవేత్త, ఆధ్యాత్మిక వేత్త ఆచార్య వేణు, మల్లేపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జహీరుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం చైల్డ్ లైన్ సంస్థ వారు రూపొందించిన చైల్డ్ కేర్ గోడ పత్రికను ప్రధానోపాధ్యాయులు శంకరయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎంఏఆర్ఐ ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు పలు సాంస్కతిక కార్యకలాపాలతో అలరించారు.