Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
హావీర్ ఆటో డయాగ్నోస్టిక్స్, స్కోడా ఆటో ఇండియా భాగస్వా మ్యంతో న్యూ బోయిన్పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన మహావీర్ స్కోడా షోరూంను స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జక్ హౌలిస్ ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. శక్తివంతమైన ఉత్పత్తి జాబితాతో స్కోడా బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా ముందుకెళ్తున్నామనీ, ఇందులో భాగంగా మహావీర్ ఆటో డయాగ్నోస్టిక్స్తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. స్కోడా ఆటో ఇండియా కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన ' కుషాక్ ' అసాధార ణ వృద్ధిని నమోదు చేస్తుందనీ, ఇండియా 2.0 వ్యూహంలో ఇది మొదటి దశ అనీ, తమ తర్వాత ఉత్పత్తి ' స్లావియా ' మరో గేమ్ ఛేంజరాగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మహావీర్ ఆటో డయాగ్నోస్టిక్స్ డీలర్ ప్రిన్సిపల్ యశ్వంత్ బక్తోతో కలిసి షోరూంలో తొలి స్కోడా కారును కొనుగోలు చేసిన గచ్చిబౌలికి చెందిన సీతారాంరెడ్డి, చేతనరెడ్డికి తాళం చెవిలను అందజేశారు.