Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసే వైన్స్‌లకు మెయిన్ రోడ్డుపై అనుమతి ఇవ్వ వద్దని కీసర పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు బీజేపీ మండల నాయకులు వినతిపత్రం అందజ ేశారు. కీసర నుంచి కుషాయి గూడకు వెళ్లే రహదారిలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఎదురెదురుగా రెండు మద్యం దుకాణాలు ఉండటం వల్ల సమీప ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మద్యం దుకాణాల వద్ద రద్దీగా మారడంతో అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. మద్యం ప్రియులు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అశోక్ ముదిరాజ్, నల్లా వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.