Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
మసాజ్ పార్లర్ ముసుగులో అసాంఘీక కార్యకలా పాలను నిర్వహిస్తున్న స్పా సెంటర్‌పై ఎస్ఓటీ పోలీసులు దుడులు చేశారు. అస్సాం, రాజమండ్రి, హైదరాబాద్‌లోని ఐదుగురు బాధితులను రక్షించారు. రాచకొండ కమిషనర్ ఎం.మహేష్ భగవత్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించారు. మంగళవారం విస్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ రాచకొండ మల్కాజిగిరి జోన్లో డెకారు ఆపరేషన్ నిర్వహించి ఏఎస్రావు నగర్‌లోని గ్లోవిష్ బ్యూటీ కేర్ స్పా సెంటర్‌పై దాడులు చేశారు. కుషాయి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్రావు నగర్లో ఓ ఆర్గనైజర్‌ని పట్టుకుని లైంగిక కార్యకలాపాలకు పాల్పడు తున్న ఐదుగురు బాధితులను రక్షించారు. వారి వద్ద నుంచి రూ.500, 2 మొబైల్ ఫోన్లు, 3 కండోమ్ ప్యాకెట్లు, ఒక రిజిస్టర్ బుక్, 2 భారత్ పే స్కానర్లను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్, కుషాయిగూడ పోలీసులు కుషాయి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్ రావు నగర్లో డెకారు ఆపరేషన్ నిర్వహించి ఓ ఆర్గనైజర్ మహేష్‌ను అదుపులోకి తీసుకుని అక్రమ లైంగికదాడికి పాల్పడుతున్న ఐదుగురు బాధితులను రక్షించారు. మొదటి అంతస్తు, కెఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన, డాక్టర్ ఏఎస్ రావు నగర్లో ఉన్న గ్లోవిష్ బ్యూటీ కేర్ స్పా సెంటర్లో క్రాస్ మసాజ్ ముసుగులో కార్యకలాపాలు నిర్వహించారు. వరంగల్, కాప్రాకు చెందిన ఆర్గనైజర్ మహేశ్‌కు మానవ అక్రమ రవాణా నిర్వాహకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ స్పా సెంటర్లలో మంచి జీతాలతో ఉద్యో గాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో యువ తులను కొనుగోలు చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చేరుకున్న యువతులను బలవంతంగా అక్రమ లైంగిక కార్యకలాపా ల్లోకి లాగుతున్నారు. ఆర్గనైజర్ మహేష్ అక్రమంగా డబ్బు సంపాదించడానికి మసాజ్ అమ్మాయిలను లైంగిక కార్యకలాపాలకు బలవంతం చేశాడు. విచారణ సంద ర్భంగా స్పా నిర్వాహకుడు తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తెప్పిం చడం ద్వారా కొన్ని నెలలుగా గ్లోష్ బ్యూటీ కేర్‌ను నడుపు తున్నట్టు పేర్కొన్నాడు. నిర్వాహకుడు స్పా సెంటర్లో అనేక క్యాబిన్లను ఏర్పాటు చేశాడు, కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు, కస్టమర్లను సంతృప్తి పరిచేలా మసాజ్ చేసే అమ్మాయిలను లైంగిక కార్యకలా పాల్లో పాల్గొనమని బలవంతం చేసేవాడు. ఇలా చేయడం ద్వారా చాలా మంది కస్టమర్లు భారీ మొత్తం చెల్లించి స్పా సెంటర్‌ను ఆశ్రయిస్తున్నారు. పట్టుబడిన నిర్వాహకుడు, బాధితులను కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, అసభ్యకర వస్తువులను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ దాడిలో ఏడీజీ సుధీర్ బాబు, డీసీపీ రక్షితామూర్తి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డి.సురేందర్‌రెడ్డి, ఇన్ స్పెక్టర్ జి.నవీన్ కుమార్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎ.మన్మోహన్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ సిబ్బంది, కుషాయిగూడ పోలీసుల, తదితరులు పాల్గొన్నారు.