Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం భోలక్‌పూర్ కష్ణానగర్లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని బుధ వారం పేరెంట్స్ కమిటీ, హై స్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల సాధన కమిటీ కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్(హెచ్‌యూజే) అధ్యక్షుడు ఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ... సికింద్రాబాద్ మండలంలో మేకల మండి ప్రాథమికోన్నత పాఠశాలలో 760 మంది పేద విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అయితే ఇక్కడ కేవలం 10 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తు న్నారని, అన్ని సబ్జెక్టులనూ బోధించేవారు లేరని చెప్పారు. ఓవైపు పేదరికం, మరోవైపు కరోనా తర్వాత ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులతో ప్రయివేటు ఫీజులు కట్టలేక, చాలామంది మేకలమండి స్కూల్లో చేరారని, అడ్మిషన్లు పెరిగిపోయా యని, ఇంగ్లీష్ మీడియంలో చక్కని బోధన అందిస్తూ చుట్టుపక్కల ప్రజల నుండి మంచి ఆదరణ ఈ పాఠశాల పొందుతోందని తెలిపారు. విద్యార్థుల నిష్పత్తికి అనుగు ణంగా ఉపాధ్యాయులను నియమించాలన్నారు. తాము ఇదివరకే రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. మంత్రి స్పందించి డీఈవో కు చెప్పారని, అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా విద్యా శాఖ అధికారులు , ప్రభుత్వం వెంటనే ఈ పాఠశాలకు టీచర్లను నియమించాలని, లేదంటే పేరెంట్స్ కమిటీ, హైస్కూల్ సాధన కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హై స్కూల్ సాధన కమిటీ కో కన్వీనర్ బి.నర్సింగ్ రావు, ఎస్ఎంసీ కమిటీ చైర్మెన్ పుల్లారావు, వైస్ చైర్మెన్ వరలక్ష్మి, విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా ఈ ఘటనపైడీఈవో రోహిణీ స్పందించారు. హైస్కూల్ అదనపు గదులకోసం ఎమ్మెల్సీ వాణీదేవి నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు.