Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు
పలు కాలనీల్లో పర్యటన
నవతెలంగాణ-అల్వాల్
పలు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తుండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయనీ, దీని కారణంగా నీటి నిల్వలు పెరిగి దోమలు పెరిగే అవకాశం ఉందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబా బు, సీనియర్ ఎంటమాలజిస్ట్ లచ్చిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్లోని ప్రుడెన్షియల్ బ్యాంక్ కాలనీ శివనగర్ కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా దోమల వల్ల వ్యాధుల బారిన పడిన గృహాల వ్యక్తులను కలిసి వారి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. ప్రుడెన్షియల్ బ్యాంక్ కాలనీ ప్రెసిడెంట్ నీలిమా రెడ్డితో కలిసి ఎంటమాలజీ సిబ్బందిని రానివ్వని గృహాల యజమానులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించారు. శివనగర్ కాలనీలో 150 గృహాల బయట పరిసరాల్లో ఏసీఎం పౌడర్ మరో 50 గృహాల లోపల పైరిత్రమ్ మందును పిచికారీ చేయిం చారు. భూదేవి నగర్ రైల్వే కట్ట పరిసర ప్రాంతాల్లోని గుడిసెల్లో నివసించే ప్రజల ఆరోగ్యం పై ప్రముఖ కవి గద్దర్‌ను కలిసి త్వరలోనె వారు నివసించే గృహాల వద్ద ఆరోగ్య శిబిరం, దోమల ద్వారా వచ్చే వ్యాధులపై అవగా హనా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. దోమలు ఇంటిలోకి ప్రవేశించకుండా ఇంటి లోపల బయట ఔషధ గుణాలు గల లెమన్ గ్రాస్ నీమ్ బంతి, సిట్రోనిల్లా మొక్క లను పెంచుకోవాలనీ, దోమలు వృద్ధి చెందకుండా బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో వారానికి ఒకసారి ఎవరి ఇంట్లో వారు దోమల పెరుగుదలకు ఉపయోగపడే వస్తువులను తొలగించాలని వివరిస్తూ ముఖ్యంగా ఇండ్లు ఇంటి పరిసరాలు, ఆఫీసులు, పరిశ్రమలు, మూతలు లేని ఓవర్‌హెడ్స్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, సిమెంట్ హౌస్ తొట్టీలు, కుండీలు, కూలర్లు, నల్లకుంటలు, పాత టైర్లు, పూల కుండీల కింద ప్లేట్లు తాగి పడేసిన కొబ్బరి బొండాలు, ఇతర పనికిరాని, పగిలిపోయిన వస్తువుల్లోని నిల్వ నీటిలో దోమలు గుడ్లు పెట్టి పెరుగుతాయనీ, వీటన్నిటిని తొలగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ఆసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ అనిల్‌కుమార్, సూపర్వైజర్లు వేలు, రాజు, గణేష్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.