Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తారమతిపేటలో సోమవారం రాత్రి 'మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి, హత్య' ఘటన కేసులో నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్స్పెక్టర్ స్వామితో కలిసి వివరాలను వెల్ల డించారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తార మతిపేట గ్రామానికి చెందిన అండాలు (50) సోమవారం రాత్రి లైంగిక దాడి, హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమెను హత్య చేసిన నిందితులు ఆమె అనంతరం మెడలో ఉన్న ఆభరణాలు కూడా దోచుకెళ్లారు. నిందితులిద్దరూ అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, సురేష్. సురేష్ గ్రామంలోనే పందులను కాస్తాడు, శ్రీకాంత్ గొర్లను మేపుతూ ఊర్లోనే జులాయిగా తిరుగుతుంటాడు. మద్యానికి బానిసైన ఇద్దరూ సోమవారం సాయంత్రం ఊరు బయట మద్యం సేవిస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న అండా లను చూసి ఆమెపై లైంగికదాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఆమెను ఇంటి వద్ద వదిలి పెడతామని నమ్మించి తీసుకెళ్లారు. అక్కడ ఆమె భర్త ఉండటంతో అతన్ని బయటకు తీసుకెళ్లి మద్యం తాగించారు. ఆ తర్వాత అతన్ని హతమార్చాలని డిసైడ్ అయ్యారు. అనుమానం వచ్చిన ఆమె భర్త వారి నుంచి తప్పించుకుని తెల్లవారెంత వరకు ఊరు బయటే ఉన్నాడు. అయితే అతను వారి నుంచి తప్పించుకుని వెళ్లడంతో తిరిగి ఇంటికి వెళ్లిన ఆ ఇద్దరు నిందితులు ఆమెపై లైంగికదాడి చేశారు. ఆ తర్వాత మెడ భాగంలో గాయాలు చేసి రొకలిబండతో బాది హత్య చేశారు. ఆమె మెడలో ఉన్న నగలను ఎత్తుకెళ్లారు. తెల్లవారు చూసిన ఇరుగుపొరుగు వారు, ఆమె భర్త పోలీసులకు సమాచారం అందించారు. భర్త ఇచ్చిన సమాచారంతో సురేష్, శ్రీకాంత్‌లను అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు.
ఆధారాలు కూడా దొరకకుండా జాగ్రత పడ్డ నిందితులు..
అండాలును హతమార్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న ఆభరణాలను తీసుకుని అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు గేటుకు కానీ, మరి ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్లు పడకుండా జాగ్రత పడ్డారు. అయితే పోలీ సులు తమదైన శైలిలో టెక్నికల్ ఎవిడెన్స్తోపాటు అక్కడే మరికొన్ని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేశారు. నిందితులకు గంజాయి అలవాటు ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసు బృందాన్ని ఏసీపీ అభినందించారు.