Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
హయత్నగర్లో నూతన అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ బుధవారం శ్రీకారం చుట్టింది. 1983లో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించడానికి భూమి పూజను రామోజీ ఫౌండేషన్ ఎండీ విజయేశ్వరి, ఫైర్ సర్వీస్ డీజి సంజరు కుమార్ జైన్లు కలిసి నిర్వహించారు. కోటి రూపాయలతో మోడల్ ఫైర్ స్టేషన్ నిర్మాణంతోపాటు సిబ్బందికి ఆధునిక సౌకర్యాలు కల్పించను న్నారు. ప్రాంతీయ అధికారి పాపయ్య, కేంద్ర అధికారి శ్రీనయ్యతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.