Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రఖ్యాత విద్యాసంస్థ ''ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యునికేషన్స్'' (ఇరిసెట్) 64వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. రైల్వే బోర్డు సభ్యులు (మౌలిక సదుపాయాలు) సంజీవ్ మిట్టల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎమ్. కృష్ణ ఎల్లా కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
సంజీవ్ మిట్టల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... సిగలింగ్ అండ్ టెలి కమ్యూనికేషన్స్‌లో అనేక క్లిష్టమైన సవాళ్లతో కూడిన అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వృత్తి న్కెపుణ్యతకు పునాది వేస్తున్న ఇరిసెట్ పట్ల భారతీయ రైల్వేలోని ఎస్ అండ్ టి సిబ్బంది హృదయాలలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశ నిర్మాణం కోసం రైల్వే జోన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అభ్యర్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలన్నారు. భద్రతను మెరుగుపర్చడానికి, స్వదేశీ సాంకేతికతను ప్రోత్సాహిస్తూ కవచ్ (రైళ్లు ఢకొీనడాన్ని నివారించే వ్యవస్థ), అటోమెటిక్ సిగలింగ్, ఎల్‌టిఇ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) అండ్ సిటిసి (సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్) వంటి అంశాలపై సాంకేతిక శిక్షణ అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సంస్థకు సూచించారు.
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ... కొవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులను తరలించడం, నిత్యావసర వస్తువులను రవాణా చేయడంలో భారతీయ రైల్వేలో ప్రధాన పాత్ర పోషించిన ఫ్రంట్‌లైన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. క్లిష్ట సమయాల్లో సవాళ్లను ఎదుర్కొ నేందుకు మెరుగైన శిక్షణ ఇవ్వడంలో ఇరిసెట్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. భారతీయ రైల్వేల నిర్వహణ సామర్థ్యం పెంపునకు తోడ్పడేందుకు కృత్రిమ మేధస్సు మరియు యంత్రాంగం వినియోగంలో అభివృద్ధి సాధించడానికి స్టార్టప్‌ల మరియు ఇతర సంస్థల సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. ఆధునిక సాంకేతిక న్కెపుణ్యతను పెంచుకోవాలని మరియు అభ్యాస ప్రక్రియను ఆధునీకరించాలని అధ్యాపకులను కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రసంగిస్తూ ఇరిసెట్ మార్గదర్శకాల ప్రకారం జోనల్ ట్రైనింగ్ స్కూళ్ల ద్వారా ఆధునిక సాంకేతికలో సిగలింగ్ అండ్ టెలికమ్యునికేషన్ విభాగం సిబ్బందికి క్షేత్రస్థాయిలో శిక్షణ అందజేస్తున్నట్టు తెలిపారు.
భద్రతా పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని, సామర్థ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు సాంకేతిక పద్ధతి నిర్వహణలో స్వాలంబన పెంపొందించుకునే అవసరం ఉందన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి వెబ్ ఆధారిత శిక్షణను బలోపేతం చేయాలని ఆయన అన్నారు. ఇరిసెట్ డ్కెరెక్టర్ ఎస్కే గోయల్ సమావేశంలో పాల్గొన్న వారందరికీ స్వాగతం చెప్పారు. ఇరిసెట్ డైరెక్టర్ జనరల్ వార్షిక నివేదికను ఆయన సమావేశంలో సమర్పిస్తూ రైల్వే అధికారులకు మరియు సూపర్వైజర్లకు మెరుగైన సాంకేతిక శిక్షణను అందించడంలో సంస్థ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కోవిడ్ మహమ్మారితో దేశవ్యాప్తంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలలో క్రియాశీలకమైన మరియు సౌకర్యవంతమైన మార్పులు చేపట్టి ఆన్లైన్ మరియు క్యాంపస్ శిక్షణలో సమతుల్యం పాటిస్తూ మెరుగైన శిక్షణను అందించినట్టు తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను అభివృద్ధిపరిచి బహుళ రంగాల అంశాలతో కూడిన శిక్షణా పరిజ్ఞానాన్ని నూతన బోధనా పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్ది శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.
కోర్సులలో నమోదు కోసం, హాస్టల్ గదుల కేటాయింపునకు, ప్రయాణ అవసరాలకు వాహనాల బుకింగ్‌కు, అభ్యాసానికి వనరుల లభ్యత, ఆన్లైన్లో మూల్యాంకనం, మరియు సర్టిఫికెట్ల జారీ కోసం ట్రయినింగ్ మేనేజ్మెంట్కు పూర్తి స్థాయిలో ఆఫీస్ ప్రవేశపెట్టడంతో ఇంజినీర్ శిక్షణార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడంలో ఎంతో డిజిటల్ కార్యక్రమాలు ఎంతో తోడ్పడ్డాయన్నారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ (ఎన్ఏఐఆర్), వడోదార డైరెక్టర్ జనరల్ ఎస్పి ఎస్ చౌహాన్, రాహుల్ అగర్వాల్ అడిషనల్ మెంబర్ (సిగల్), అరుణా సింగ్, అడిషనల్ మెంబర్ (టెటికామ్), రైల్వే బోర్డు కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. రైల్వే బోర్డు ప్రతినిధులు భారతీయ రైల్వే నెట్వర్క్ సామర్థ్యం పెంపునకు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మరియు పరిశ్రమల నిర్వాహకులకు రైల్వే సిగలింగ్ వ్యవస్థపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.
సమావేశం ప్రతినిధులు శిక్షణార్థుల నైపుణ్యత మెరుగు కోసం కవచ్ మరియు రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టంపై నూతన ల్యాబొరేటరీ సౌకర్యాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంకేతిక పత్రిక జ్ఞాన్‌దీప్ మరియు ఆధునిక సాంకేతికతతో టెక్నికల్ నోట్స్‌ను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రదర్శించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రైల్వే సిగలింగ్ అండ్ టెలికమ్యునికేషన్స్ (ఎస్‌అండ్‌టి) ఉద్యోగులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇరిసెట్ను 24 నవంబర్ 1957 తేదీన ప్రారంభించబడిరది. ఈ సంస్థ భారతీయ రైల్వే వారి ఎస్ అండ్ టి సిబ్బందికే కాకుండా ఇతర ప్రభుత్వ మరియు ఎన్టిపిసి, డిఎఫ్‌సి సిఐఎల్, ఆర్ఐటిఇఎస్, ఆర్‌విఎన్‌ఎల్ మరియు ఆర్‌సిఐఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందికి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఇరిసెట్ సిగల్ ఇంజినీరింగ్, ఐఆర్ఎస్ఎస్ఈకి చెందిన గ్రూప్ 'ఏ' సర్వీసు అధికారులు, ఎస్ అండ్ టి ఇంజినీర్లకు శిక్షణ అందించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.
కోవిడ్ మహమ్మారితో అనేక ఇబ్బందులు ఏర్పడినా ఈ సంవత్సరంలో ఆన్‌ల్కెన్ మరియు క్యాంపస్ శిక్షణా పద్ధతుల ద్వారా 114 ట్రయినింగ్ కోర్సులను నిర్వహించి రికార్డు స్థాయిలో 5801 మంది శిక్షణార్థులకు శిక్షణ ఇచ్చింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో కేంద్రీకృత శిక్షణ సంస్థలలో భారతీయ రైల్వే భారీస్థాయిలో శిక్షణార్థులకు శిక్షణ ఇచ్చిన ఇరిసెట్ ఈ సంవత్సరం చారిత్రక మైలురాయిని అధిగమించింది.