Authorization
Wed April 02, 2025 06:36:07 pm
నవతెలంగాణ-ఉప్పల్
బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి యత్నించడం అందులోని ఫర్నిచర్‌ను, ఆస్తి నష్టానికి పాల్పడటం చాలా హేయమైన చర్య అని కార్పొరేటర్లు బన్నాల గీత, దేవందర్ రెడ్డి, స్వర్ణ రాజులు దుయ్య బట్టారు. దాడికి నిరసనగా బుధవారం జీహెచ్‌ఎంసీి టీిఆర్‌ఎస్ కార్పొరేటర్లు అందరూ కలిసి పాలతో జీహెచ్‌ఎంసీి ఆఫీస్‌ని శుద్ధి చేశారు. అనంతరం జీహెచ్ ఎంసీి మేయర్ గౌరవనీయులు గద్వాల్ విజయలక్ష్మికి బీజేపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడు తూ జీహెచ్ఎంి ఆస్తులను బీజేపీ కార్పొరేటర్లు ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించ లేకపోతున్న విషయం బీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే రాజకీయ పరంగా గొడవ చేసారని, ఇలాంటి పనులు సహించ రాదని, కార్పొరేటర్లు చేసిన చర్యను ఖండిస్తున్నామని చిల్కనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ వెల్లడించారు.