Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సింగిడి సాంస్కతిక సంస్థ నిర్వహణలో తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో భిన్న సంప్రదాయ నత్య సమాహారం ప్రేక్షకులకు కనువిందు చేసింది. దేశాంతర నత్య కళాకారులు( శ్రీలంక) అంజనా రాజపక్షే బందం కండ్యాన్ నత్య ప్రక్రియలో నర్తించి చూపరులను ముగ్ధులను చేశారు. ప్రముఖ నర్తకి జ్యోతిర్మయి పట్నాయక్( బెంగళూరు) ఓడస్సీ ప్రక్రియలో నాట్యఅంశాలు నర్తించి ప్రశంసలు అందుకున్నారు. న్యూ ఢిల్లీకి చెందిన ఆకాంక్ష ప్రియదర్శిని మయూరి భంజని చావ్ విభిన్న నత్య ప్రక్రియలో నర్థించి అభినందనలు అందుకున్నారు. సందర్బంగా జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభ తొలి సభా పతి ఎస్. మధుసూదనా చారి పాల్గొని మాట్లాడుతో వార సత్వ సంపద అంటే సంప్రదాయ కళలు సంప్రదాయ లే నని వాటిని యువతరం కాపాడుకోవలన్నారు. తెలంగాణ ప్రాంత కళలు సాహిత్యం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలువగలవని అన్నారు. సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ మాట్లాడుతూ భిన్న ప్రాంతాల కళలు సాహిత్యం పరస్పర మైత్రి బంధానికి అవగాహనకు దోహద పడతాయన్నారు. పార్లమెంట్ పూర్వ సభ్యుడు ఎమ్. జగన్నాథం, బి. ఎస్.ఎన్. ఎల్. అధికారి బాలచరి తదితరులు పాల్గొన్నారు. వేదికపై అతిథులు వివిధ రంగాలకు చెందిన వారికి యువ, విశిష్ట పురాస్కరాలు అందజేశారు.