Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం ఉద్యమానికి మర్రి చెట్టు లఘు చిత్రం దోహద పడగలదని రాకë సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ మినీ థియేటర్లో గురువారం విజయ లక్ష్మి, మురళి మంచి నిర్మణంలో దాసరి రంగ రచించిన 'మర్రి చెట్టు' వేముగంటి దర్శకత్యంలో ప్రారంభ వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా ఈశ్వర్ పాల్గొని చిత్రానికి క్లాప్ కొట్టి మాట్లాడారు. పర్యావరణ కపడుకొంటేనే మనిషి మనుగడ అని అటువంటి సందేశాత్మక చిత్రాలు యువత నిర్మించాలని సూచించారు. భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ తమ శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర సాంకేతిక నిపుణులు నటీనటులు పాల్గొన్నారు.