Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని ప్రాదు కొల్పటంలో విభిన్న రంగాల్లో విశేష కషి చేసిన వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి జీవితాన్ని నాటకీకారణ చేసి విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో ప్రదర్శితమైంది. అభినయ, కేంద్ర సాంస్కతిక శాఖ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో అభినయ జాతీయ రంగస్థల ఉత్సవం 2021 గురువారం రవీంద్రభారతి వేదికపై ఆరంభమైనయి. ప్రముఖ రచయిత డి. విజయ భాస్కర్ రచించిన ' సురవరం' సాంఘీక నాటకం బి. ఎమ్. రెడ్డి దర్శకత్వం లో ప్రదర్శించారు. తెలంగాణలో వెనుక బడిన ప్రాతం పాలమూరు లోని గ్రామం లో పుట్టిన ప్రతాపరెడ్డి స్వయంగా కషితో ఎదిగి కవిగా జర్నలిస్ట్‌గా ఉద్యమ నిర్వహకునిగా రాజకీయ వేత్తగా విభిన్న భూమికలు పోషించిన అంశాలను ఆసక్తి కరంగా నాటకంలో చూపారు. సురవరంగా శ్రీనివాస్, ఆయన భార్య గా సురభి లలిత సురవరం చిన్నాన్న గోవర్ధన్ రెడ్డి రాజబహుదూర్ వెంకట్రామిరెడ్డిగా చేగో పాత్రోచితంగా నటించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో సాంస్కతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని సురవరం జీవితం స్ఫూర్తివంతమన్నారు. భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, సంగీత నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర పాల్గొన్న సభకు అభినయ శ్రీనివాస్ స్వాగతం పలికారు.