Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని బస్తీలు, కాలనీలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సాయశక్తులా కషి చేస్తానని కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక వెంకటేశ్వర నగర్ తిరుమల గార్డెన్ సమీపంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో డివిజన్లోని రోడ్లు, డ్రయినేజీ, మంచినీరు, విద్యుత్, కమ్యూనిటీ హాళ్లు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, రజినీకాంత్, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు సత్యమూర్తి, మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షులు గద్వాల్ జ్యోతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.