Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉప సర్పంచ్ కందుల రాజు ముదిరాజ్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఉచిత కంటి వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సర్పంచ్ కందుల రాజు ముదిరాజ్ అన్నారు. గురువారం ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబా ఆప్టికల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా దక్పథంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు దయ్యాల ఆంజనేయులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.