Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేడీస్ హాస్టల్ నుంచి అనుబంధ కాలేజీలకు ప్రత్యేక బస్సులు నడపాలని గురువారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ప్రొ. పి. లక్ష్మీనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ నుంచి కోఠి, నిజాం, సైఫాబాద్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ల విద్యార్థులకు ప్రత్యేక బస్ సౌకర్యాలు కల్పించాలని, ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ నుంచి బస్సు సౌకర్యం సరిగా లేకపోవడంతో అమ్మాయిలు కళాశాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిపోయిందని అన్నారు. యూనివర్సిటీ హాస్టల్స్లో టాయిలెట్స్, వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ సమస్యలు పరిష్కరించాలన్నారు. మెస్ క్వాలిటీగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఓయూ విద్యార్థులకు స్కాలర్షిప్ పెంచాలని, ప్రతి విద్యార్థికి ఫెలోషిప్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ సమస్యలపై అధికారులు వారం రోజుల్లో పరిష్కారం చూపకపోతే ఆందోళన బాట పడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు ఎస్.నాగేశ్వరరావు, పి.మహేష్, స్వాతి, ఎన్. సుమంత్, భార్గవి, మమత, మీనా, నవ్య, అఖిల, దేవయాని, గౌరీ పాల్గొన్నారు.