Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారని జాతీయ కిసాన్ సెల్ వైస్ చైర్మెన్ కోదండరెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ అన్నారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ రైతులు పండించిన వరి పంటను కొనకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణ రైతులు ధాన్యం పండించి అమ్ముకోలేక కల్లాలల్లో ఆరబోసి, వర్షాలకు తడిసి ధాన్యం మొలకలెత్తే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రోటోకాల్ ఇన్చార్జి హర్కార వేణుగోపాలరావు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్స్ తోట కూర వజ్రేష్ యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోగుల సరిత వెంకటేష్, మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ ,బి బ్లాక్ అధ్యక్షులు సింగరేణి పోచయ్య, వేముల మహేష్ గౌడ్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మండల అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి, శామీర్పేట మండల అధ్యక్షులు యాష్కి శంకర్ గౌడ్, మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు బొమ్మల పల్లి నరసింహులు, కీసర మండల అధ్యక్షులు కోల కష్ణ యాదవ్, దమ్మాయిగూడ మున్సిపల్ అధ్యక్షులు ముప్పా రామారావు, నాగారం మున్సిపల్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, ఘట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్, పీర్జాదిగూడ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, పోచారం మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మంచాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.