Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగారం మున్సిపల్ చైర్మెన్కౌకుంట్ల చంద్రారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
వైకుంఠ ధామంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. గురువారం నాగారం పురపాలక సంఘం పరిధిలోని 20వ వార్డులో రూ. కోటి నిధులతో చేపట్టిన హిందూ శ్మశాన వాటిక అభివద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ అన్నమరాజు సుమిత్ర సురేశ్, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, డీఈఈ సుదర్శనం రఘు పాల్గొన్నారు.