Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించి రెండేండ్లు గడుస్తున్నా ముఖ్యమంత్రి హామీ అమలుకు నోచుకోలేదని తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఐక్య వేదిక కార్యనిర్వాహక అధ్యక్షులు తమటం విజరు కృష్ణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రాం కుమార్, శ్రీనివాస్ అన్నారు. గురువారం బస్‌భవన్‌లో టీఎస్ ఆర్టీసీ వీసీ ఎండీ సజ్జనార్‌ను కండక్టర్ ఐక్య వేదిక బృందం మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ఉద్యోగ భద్రతను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్ టిక్కెట్ లేని ప్రయాణికుడికి నిర్దిష్టమైన జరిమానా విధించాలని, దానికి కండక్టర్‌ను బాధ్యున్ని చేయరాదని విజ్ఞప్తి చేశారు. కండక్టర్ ఉద్యోగ భద్రతకు ఆటంకంగా ఉన్న టీఎస్ ఆర్టీసీ నియమ నిబంధనలు 1963, సీపీఏ నియమ నిబంధనలు1967, ఇటీవల జారీ చేసిన ఉద్యోగ భద్రత మార్గదర్శకాలను సమూలంగా మార్పులు చేయాలని కోరారు. ఎమ్వీ యాక్ట్ 1988, సెక్షన్ 124, 178లను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కండక్టర్ ఐక్య వేదిక చైర్మెన్ తేజవతి, నాయకులు జీవన్, సాయిలీల, సమత తదితరులు పాల్గొన్నారు.