Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆటోలో ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్లు, విలువైన వస్తువులను తస్కరిస్తున్న ముఠాల గుట్టును సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు రట్టు చేశారు. వేర్వేరు నాలుగు ముఠాలకు చెందిన 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని నుంచి రూ.12లక్షల విలువైన 92 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నగర పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జి.చక్రవర్తితో కలిసి సీపీ అంజనీకుమార్ తెలిపిన వివరాల మేరకు హఫీజ్ బాబానగర్‌కు చెందిన ఎండీ మహమూద్ అలీ, ఎండీ ఖాన్, అమర్ ఖాన్లు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. ఆటోలో ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకుని ఆటో డ్రైవర్‌తోపాటు ఇద్దరు ముగ్గురు ఆటోలో ప్రయాణీస్తున్నారు. ప్రయాణికుని దృష్టి మళ్లించి సెల్ఫోన్లు, విలువైన వస్తువులను తస్కరిస్తున్నారు. ఇదిలావుండగా మైలార్ దేవులపల్లికి చెందిన ఎండీ మోసీన్, చాంద్రయాణగుట్టకు చెందిన ఎండీ మూసా ఆటోను అద్దెకు తీసుకుని ప్రయాణీకుల వద్ద సెల్ఫోన్లను తస్కరిస్తున్నారు. ఇదే తరహాలో పహాడీ షరీఫ్‌కు చెందిన ఎండీ మన్సుర్, ఎండీ దస్తగిరిలు ప్రయాణీకుల వద్ద విలువైన సెల్ఫోన్లను తస్కరిస్తున్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన ఎండీ అబ్దుల్ హాజీ, ఎండీ రఫీక్యులు ఒక ముఠాగా ఏర్పాడి ఇండ్లను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ప్రత్యేక దృష్టి సారించిన టాస్క్ఫోర్సు పోలీసులు నాలుగు ముఠాలకు చెందిన వారిని అరెస్టు చేశారు. నిందితులు పాత నేరస్తులన్నారు. నిందితులు అరెస్టు కావడంతో 19 కేసులు ఛేదించామని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రా,కేఎస్ సుబ్బారావు, ఎస్ఐలు శ్రీశైలం, వి.నరేందర్, కె.చంద్రమోహన్తోపాటు కంచన్‌బాగ్, చంద్రయాణ్గుట్ట, డబీర్‌పురా, అఫ్జల్‌గంజ్ పోలీసులు పాల్గొన్నారు.