Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్
నవతెలంగాణ-అడిక్మెట్
కామ్రేడ్ చిన్న కోటి సేవలు వెలకట్టలేనివని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు అన్నారు. వరంగల్లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కామ్రేడ్ చిన్న కోటికి విద్యానగర్లోని పుల్లారెడ్డి భవన్లో నివాళి అర్పించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ కోటి ఆదివాసీ ప్రజలకోసం మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రాంతానికి వెళ్లినట్లు వివరించారు. ఆయన జీవితంలో అనేక కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిఘటన పోరాటమే సరైన మార్గం దృఢంగా నమ్మకాన్ని కలిగిఉన్నారన్నారు. 2013లో కామ్రేడ్ చంద్రన్న నాయకత్వంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలో నడిచారని పేర్కొన్నారు. కోటి అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా వైద్యం చేయించుకుంటూ బుధవారం రాత్రి వరంగల్ ఎంజీఎంలో మరణించాడని తెలియజేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి అచ్యుత రామారావు ప్రసంగిస్తూ కామ్రేడ్ కోటి ఎంతో పట్టుదల, కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం గలవాడని, ఆయనతో తనకున్న జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అరెల్లి కృష్ణ, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె. సీతారామయ్య, శివబాబు, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం,పరశురాం, హైదరాబాద్ నాయకులు రియాజ్, గణేష్, సైదులు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు భారతి, ఐఎఫ్టీయూ నాయకులు స్వామి, శీలం స్వామి, జెట్టి లక్ష్మన్, ఇక్కిరి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.