Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్లోని టెలికాం కాలనీ, రామచంద్రయ్య కాలనీ, చితారయ్య కాలనీ, సుభాష్ నగర్, ఇంద్రనగర్ కాలనీల్లో మహిళా భవనం కోసం నిధులు కేటాయించాలని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను కలిసిన స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటాపురం డివిజన్లోని ప్రతి కాలనీలో మహిళా భవన్ ఉండాలనే లక్ష్యంతో భవనాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కమిషనర్ స్పందించి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి తాము సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు.