Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ ఓల్డ్ నేరేడ్మెట్లోని రామాల యం వెనక వైపు ఉన్న బోర్ రిపేరింగ్ పనులను, అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను శనివారం మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డు పనులల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఎలాంటి లోపాలు లేకుండా జరిగేలా చూడాలని కాంట్రాక్టర్స్కు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటి, నందు, మురళిగౌడ్, కిషన్, సందీప్, కాలనీ వాసులు పాల్గొన్నారు.