Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం కృషి చేస్తుందని టీఎన్జీవో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవి ప్రకాష్ అన్నారు. శనివారం మేడ్చల్ కలెక్టరేట్లోని టీఎన్జీవో భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్బంÛగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగులందరూ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘంలో సభ్యత్వం తీసుకోవాలన్నారు. తెలం గాణ సాధనలో టీఎన్జీవో అనేక పోరాటాలు చేసిందనీ, ఉద్యోగుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. బేసిక్ పేలో 1శాతం కట్ చేసి ఉద్యోగులకు హెల్త్ కార్డు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ కార్యాలయానికి బస్సు సర్వీసులను నిలిపేయడం వల్ల కలెక్టరేట్‌కు వచ్చే ఉద్యోగులు వివిధ పనులపై వచ్చే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ, వెంటనే బస్సు సర్వీసులను పునరుద్ధ రించాలని కోరారు. అనంతరం ఉద్యోగులకు సభ్యత్వ నమోదు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టీఎన్జీవో కార్యదర్శి ప్రవీణ్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు జేమ్స్, కార్యదర్శి రవికుమార్, కార్యవర్గ సభ్యులు కిషోర్ శ్రీకాంత్, వెంకటేశ్వరరావు, సురేఖ, వెంకటేశ్వర్‌రెడ్డి, షరీఫ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.