Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
మహిళా మండల్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు గొప్పవని రాంగోపాల్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. శనివారం బేగంపేటలోని దేవనార్ అందుల పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అథితిగా హాజరై 'స్నేహం' అనే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బ్రెయిల్ లిపి పుస్తకాలు, భాష పుస్తకాలు, లైబ్రరీ బుక్స్‌ను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా, ఖుష్బ అగర్వాల్, దేవనార్ అంధుల పాఠశాల అధ్యక్షురాలు జ్యోతిగౌడ్, రాంగోపాల్‌పేట్ డివిజన్ యువమోర్చా అధ్యక్షుడు నామన్ భన్సాలీ జైన్, జైన్ శ్వేతాంబర్ తేరాపంత్, మహిళా మండల్ అధ్యక్షుడు అనితా గిరియా, ప్రధాన కార్యదర్శి శ్వేతా సేథియా, తదితరులు పాల్గొన్నారు.