Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సాయన్న శనివారం కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలోని పలు వార్డుల్లో బాధితులకు ఇండ్లుకు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఒకటో వార్డులో కట్టెలమండిలో షాహీన్ బేగంకు రూ.60 వేలు, రెండో వార్డు పోలీస్ లైన్ నివాసి హరిరాజ్ కు రూ.60 వేలు, బాలాంరాయి సొసైటీ నివాసి అజరుకుమార్కు రూ.60 వేలు, నంద మూరి వాచి శశికళకు రూ.60 వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్రెడ్డి, నాయకురాలు నివేధిత, మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్, దేవళ్లపల్లి పాల్గొన్నారు.