Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఈ నెల 27, 28 తేదీల్లో భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కాప్రా మండలం జనవిజ్ఞాన వేదిక అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, వెంకట రమణ కోరారు. కాప్రా జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 33 ఏండ్లుగా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారదోలేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల్లో బాల్యం నుంచే శాస్త్రీయ దక్పథం, సైన్స్ కార్యక్రమం నిర్వహిస్తూ, సైన్స్ పట్ల చైతన్యం తీసుకొచ్చేందుకు జనవిజ్ఞానవేదిక కృషి చేస్తుందన్నారు. ఈ రాష్ట్ర మహా సభలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు హాజరొ కానున్నట్టు తెలిపారు. రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడంతో పాటు గతంలో జరిగిన కార్యక్రమంపై సమీక్ష చేసుకుంటూ, భవిష్యత్ రోజుల్లో జన విజ్ఞాన వేదిక తీసుకోబోయే కార్యక్రమలు తెలియజేసేందుకు రాష్ట్ర మహాసభలు నిర్ణయిస్తారని తెలియజేశారు.