Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిలో అవసరమైన పరికరాల నిమిత్తం ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.9 లక్షలా 50 వేలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, టీఆర్ ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, జీఎన్వీ సతీష్ కుమార్, రాము యాదవ్, మోహన్ రెడ్డి, సంతోష్ రాందాస్, నర్సింగ్, ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.