Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవా లని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు శనివారం తాడ్‌బండ్ క్రాస్ రోడ్డు నుంచి రహదారి విస్తరణ కోసం అధికారులు పరిశీలించారు. బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ పర్యటించింది. బ్రిగేడియర్ అభిజిత్, సీఈఓ బి.అజిత్, కపిల్ గోయల్ తెలంగాణ అండ్ ఆంధ్ర డీఈఓ మాజీ సభ్యుడు పాండు యాదవ్, కంటోన్మెంట్ బోర్డు ఇంజినీర్స్ రాములు, గోపాలకృష్ణదాస్, కంటోన్మెంట్ శానిటరీ అధికారి దేవేందర్, ట్రాఫిక్ సీఐ రవికుమార్ ప్రమాదాలు అడ్డాలగా మారిన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మలుపు రోడ్ల విస్తరణ చేపట్టేందుకు చర్యలు తీసుకునే విషయంపై చర్చలు జరిపారు. తాడ్‌బండ్ నుంచి బోయిన్‌పల్లికి వెళ్లే మార్గంలో ఉన్న మలుపు రోడ్లను విస్తీర్ణం చేయాలని మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అధికారులకు చెప్పారు. ఓడీసీఈఓ అజిత్‌రెడ్డి, డీఈవో కపిల్ గోయల్ ప్రమాదాలకు కారణాలు అవుతున్న మలుపు రోడ్లను క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తూ.గో రోడ్డు విస్తరణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.