Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కోత కుట్టు లేని వ్యాసెక్టమీ శస్త్రచికిత్స శిబిరాలను విజయవంతం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ల పక్షోత్సవాలను పురస్క రించుకుని జిల్లాలో మగవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఈనెల 29వ తేదీన పీహెచ్సీ ఉప్పల్, డిసెంబర్ 3వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బాలానగర్‌లో నిర్వహించనున్న ట్టు తెలిపారు. ఈ అవకా శాన్ని జిల్లాలోని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలనే వారు వినియోగించుకోవాలని కోరారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న మగవారికి రూ.1100 నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది విస్త్రృతంగా ప్రచారం చేయాలని కోరారు.