Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
'క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోండి. రోడ్లపై గుంతలను పూడ్చేందుకు మోటార్ సైకిళ్లపై వెళ్లి పరిశీలించండి' అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం ఖైరతాబాద్ జోన్లో మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు, ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలా విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఎస్ఎన్డీపీ అధికారులను ఆదేశించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ నిరంతరం కొనసాగాలన్నారు. ప్రతిరోజూ 24 గంటలు ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలలని సూచించారు. రోడ్లపై రాత్రిపూట నడిచే స్వీపింగ్ మిషన్ల పనిని స్వయంగా పర్యవేక్షిం చాలని ఏఎంఓహెచ్, డిప్యూటీ కమిషనర్లు ఏ విధంగా పని చేస్తు న్నాయో లాగ్‌బుక్ ఆధారంగా చెక్ చేయాలన్నారు. పబ్లిక్ టాయి లెట్లు పని చేస్తున్నాయో? లేదో చెక్ చేసి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో పనిచేసేటట్టు చూడాలన్నారు. వీధి కుక్కల ఫిర్యాదులను వెటర్నరీ శాఖ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. యూసీడీ అధికారులు వెండింగ్ జోన్లను నిర్దేశించాలన్నారు. నైట్ షెల్టర్ల పనితీరుపై నిరంతరాయంగా సమీక్షించాలన్నారు. సర్కిళ్ల వారీగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ గత ఏడాదికంటే ఎక్కువగా వసూళ్లు చేసేందుకు జోనల్, డిప్యూటీ కమిషనర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ట్యాక్స్‌ను నిర్ధారించినప్పుడు, మదింపు చేసేటప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలన్నారు. జోన్ పరిధిలోని సర్కిళ్లలో రోడ్ల వెంబడి ఉన్న బెగ్గర్స్కి నైట్ షెల్టర్ కల్పించేందుకు ప్రాజెక్ట్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ వారీగా స్వయం సహాయక గ్రూపుల పురోగతిని సమీక్షించారు. ఇంజినీరింగ్ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు డివిజన్లోని ప్రతి వార్డులో రోడ్లు, శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డు వారీగా శానిటేషన్, డస్ట్‌బిన్, స్వచ్ఛ ఆటో, రోడ్ల సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు అందినా పరిష్క రించాలన్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ నగరవ్యాప్తంగా 100 శాతం ఇచ్చేందుకు డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ అధికారులు మొబైల్ వ్యాక్సినేషన్ ద్వారా వేగవంతంగా చర్యలు తీసుకోవాల న్నారు. వ్యాక్సినేషన్లో కొత్తగా నమోదు అవుతున్న 18 ఏండ్లు పైబడిన వారికి రెండో డోస్ తీసుకోని వారికి 84 రోజుల వ్యవధిలో తప్పకుండా వ్యాక్సినేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలి పారు. అనంతరం వెటర్నరీ, ఉద్యానశాఖ, మెడికల్ అధికారులతో పురోగతిలో ఉన్న పనులపై సమీక్షించారు. అన్ని జోన్లలో జనవరి 3వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం గ్రీన్ డేగా జరుపాలని మేయర్ సూచించారు. ప్రజలు తమ ఇండ్లతోపాటు పరిసరాల్లో చెట్ల పెంపకానికి కృషి చేయాలన్నారు. హరితహారం నిరంతర ప్రక్రియ అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డింగ్ అప్లికేషన్లను త్వరిత గతిన పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, ఎస్ఈ రత్నాకర్, సిటీ ప్లానర్ ప్రదీప్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు, డీపీఓ, యూబీడీ అధికారులు పాల్గొన్నారు.