Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కొత్త కొత్త ఆలోచనలతో, మారుతున్న సాంకేతికతను బట్టి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జేఎన్టీయూహెచ్ ఉప కులపతి ప్రొఫెసర్ కట్ట నర్సింహా రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలోని బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 6వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థినిలు వినూత్నంగా ఆలోచించాలని, తన జీవితంలో జరిగిన కొన్ని అంశాలను ఉదాహరించారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. చదువులో అత్యుత్తమ ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బంగారు పతకాలు అందజేశారు. కళాశాల వైస్ చైర్మెన్ రవి చంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థినిలు విభిన్నంగా అన్ని రంగాల్లో రాణించారని తెలిపారు. పట్టభద్రులు అవుతున్న విద్యార్థుల ప్రాంగణ నియామకాలు, చదువులో వారు సాధించిన విజయాల గురించి కళాశాల ప్రిన్సిపాల్ డా కేవీఎన్ సునీత తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.