Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
హైదరాబాద్ అపోలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పట్టభద్రులకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమాన్ని శనివారం గ్రాండ్‌గా నిర్వహించారు. కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అపోలో హాస్పిటల్ చీఫ్ కార్డియో దొరాసిక్ సర్జన్ డాక్టర్ విజరు దీక్షిత్‌తో కలిసి 2014, 2015లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న పట్టభద్రులకు పట్టాలను అందజేశారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు సర్టిఫికెట్స్ అందుకుని, ఎంతో ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్‌గా డాక్టర్ కీర్తన (2014 బ్యాచ్), డాక్టర్ గణేష్ రెడ్డి (2015 బ్యాచ్) ప్రతిష్ఠాత్మక డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గోల్డ్ మెడల్స్‌ను డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. జూన్ 2017లో హైదరాబాద్ మెడికల్ కాలేజీకి ఎంసీఐ నుంచి యూజీ గుర్తింపు పొందిందని, 20 విభాగాల్లో పీజీ మెడికల్ కోర్సులు ప్రవేశపెట్టే ప్రక్రియలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మెన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.