Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన న్యాక్ పనితీరు భేష్ని న్యాక్ వైస్ చైర్మెన్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కితాబిచ్చారు. శనివారం న్యాక్ ప్రధాన కార్యాలయం ఐటెక్స్లో న్యాక్ 42వ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎల్ అండ్ టీ హైడ్రాలిక్ మెకానిక్ ల్యాబ్‌తోపాటు సోలార్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు న్యాక్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పిన న్యాక్ నిరుద్యోగ యువతీయువకుల జీవితాల్లో భరోసా నింపుతుందని మంత్రి కొనియాడారు. ముఖ్యంగా వృత్తి శిక్షణతోపాటు ఉపాధి కల్పనలో దేశంలోనే ముందు వరసలో నిలిచిందన్నారు. కోవిడ్ సమయంలో న్యాక్ సమర్థవంతంగా పనిచేసిందన్నారు. 95 శాతం అచీవ్మెంట్ను సాధించిందన్నారు. కోవిడ్ సమయంలోనూ గతేడాది 16వేల మందికి శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం 20వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నిర్మాణ రంగంలో ఎంతో ప్రోత్సాహం లభిస్తుందన్నారు. న్యాక్ ఆధ్వర్యంలో బీటెక్ చేసిన వారికి ఒక సంవత్సరం పీజీ విద్యను అందించనున్నట్టు తెలిపారు. న్యాక్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాల సీలింగ్ స్లాబ్ పెంచుతున్నామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. న్యాక్‌ను మరింత బలోపేతం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని, యూనివర్శిటీ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కమిటీ వేసినట్టు గుర్తు చేశారు. కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశముందన్నారు. అనతరం న్యాక్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, న్యాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతి, న్యాక్ డైరెక్టర్ శాంతి శ్రీ తదితరులు పాల్గొన్నారు.