Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరా దేవి అన్నారు. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ (అనంతపూర్) ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన 120 మందిపైగా నందమూరి బాలకృష్ణ అబిమానుల రక్తదానం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వసుందరా దేవి మాట్లాడుతూ ఎన్బీకే అభిమానులు తమ వెంట ఎళ్లవేళలా కలిసి నడుస్తున్నారని, మంచి పనులను చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి ధృవీకరణపత్రాలు, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సీఈఓ డా.ఆర్వీ ప్రభాకర రావు, మెడికల్ డైరెక్టర్, డా.టీఎస్ రావు, అసోసియేట్ డైరెక్టర్ డా.కల్పనా రఘునాథ్, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు జగన్, భగత్ సింగ్ నగర్ సినిమా హీరో విదార్థ, హీరోయిన్ ధృవిక పాల్గొన్నారు.