Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్
నవతెలంగాణ-ధూల్‌పేట్
కార్మికుల అడ్డాల వద్ద హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అన్నారు. శనివారం సంతోష్ నగర్ లేబర్ అడ్డాపై ఆవాజ్ ఆధ్వర్యంలో మైనార్టీ కార్మికులకు టీబీపై చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ కార్మికులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారన్నారు. అడ్డాలపై మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి కార్మికులను ఆరోగ్య సమస్యల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం డాక్టర్ సత్య ప్రసాద్ టీబీపై అవగాహన కల్పించారు. రెండు వారాల నుంచి దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్య ఉంటే తక్షణమే పరీక్షలు నిర్వహించి మందులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ రఫీక్, గులాబ్ నసీర్ తదితరులు పాల్గొన్నారు.