Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
సమాజంలో స్వలింగ సంపర్కం పొందిన వారు లేదా పుట్టుకతో జన్మించిన వారికి విద్యతోనే న్యాయం జరుగుతుందని సురక్ష సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గుర్రంకొండ చిన్ని కృష్ణ, విశ్వతేజ, అనామిక, రీతు జయంత్, నిర్వాహకురాలు శుభాగత్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్వలింగ సంపర్కులపై లేదా ట్రాన్స్‌జెండర్స్, గే, హిజ్రా వివిధ నామాలతో పిలుస్తూ అవహేళన చేస్తూ సమాజంలో చిన్నచూపు చూడడం వల్ల పసితనం నుంచే వారు మనోవేదనకు గురై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం లెక్కచేయకుండా తమకు ఇచ్చిన హక్కులను కొన్ని రాష్ట్రాలు కంటితుడుపుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్వలింగ సంపర్కం పొందినవారికి పాఠ్యాంశాలను బోధించవద్దని అడ్డు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. లింగ మార్పిడి పిల్లలకు బాల్యం నుంచే విద్యను బోధించడం వల్ల అందరూ సమానం అనే విషయం, సమాజంలో వారిపై జరిగే లైంగిక దాడులు పూర్తిగా సమసిపోతాయన్నారు. జాతీయ బాలల హక్కుల సంస్థ సత్వరం దీన్ని అమలు చేసే విధంగా కార్యచరణ చేపట్టాలని కోరారు.