Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డేటా సైన్స్ మోడలింగ్, మిషన్ లెర్నింగ్ టూల్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులుగా కేఎల్ యూనివర్సిటీ (గుంటూరు)ప్రొఫెసర్ డాక్టర్. బి పోలయ్య హాజరై డేటా సైన్స్ మోడల్స్, మిషన్ లెర్నింగ్ గురించి విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో కంపెనీలో జరుగుతున్న పలు అంశాలపై సంక్షిప్తంగా వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎల్ వి. నరసింహ ప్రసాద్, డేటా సైన్స్ హెచ్ఓడీ డా.పి .గోవర్ధన్, డీన్ డా. మధు బాల మాట్లాడుతూ కంపెనీలో జరుగుతున్న వివిధ విషయాలపై వృత్తిపరమైన తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవచ్చు అన్నారు. కార్యక్రమ కోఆర్డినేటర్‌గా డా. లక్ష్మి ప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.