Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
గృహ హింస నిరోధక చట్టం 2005పై అవగాహన కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, గండి చెరువు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సఖి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి శాంతిశ్రీ హాజరై గహహింస నిరోధక చట్టం 2005పై అవగాహన కల్పుస్తూ, సఖి అందిస్తున్న వివిధ సేవలు, కౌన్సిలింగ్, న్యాయ సహాయం, తాత్కాలిక వసతులు, పోలీసు, వైద్య సేవలపై అవగాహన కల్పించారు. ఇరవై నాలుగు గంటల అత్యవసర సహాయం కోసం 181, 100కు, చిన్న పిల్లల సహాయంకు 1098, సఖి టోల్‌ఫ్రీ నెం.9494948696 ఫోన్ చేయాలని సూచించారు. హింసకు గురైన మహిళలకు, బాలికలకు సఖి సేవలు అందిస్తుందని తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్ వైజర్ యశోద, సఖి హోమ్ గార్డు సుమన్, శాంతరెడ్డి, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.