Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో వాల్పోస్టర్ రిలీజ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి వర్షపు నీటి బొట్టునూ కాపాడుకోవాలని, జలవనరు లను రక్షించుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పిలుపునిచ్చారు. యువత, యువజన సంఘాలు, మహిళా మండళ్ల ద్వారా వర్షపు నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల న్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఆఫీసర్ ఎన్.వై.కె. ఖుష్బుగుప్త, వి.చంద్రశేఖర్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ జగపతిబాబు, వాలంటీర్లు పాల్గొన్నారు.